ఆ ఘనత బీజేపీదే… దేశానికి
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే సీఎం అవుతారని బీజేపీ నేతల ఈటల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర వర్గాలకు చెందిన వ్యక్తి సీఎం కారనేది వాస్తవమన్నారు. పార్టీ అధ్యక్ష పదవిలోనూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారని తెలిపారు. ఇతర రాష్ట్రాల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్లు బీఆర్ఎస్ కుటుంబసభ్యులే ఉంటారు. ఇతర వర్గం, ఇతర కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వరు. తెలంగాణ వస్తే బడుగులకు అధికారం, జీవితాల్లో వెలుగు వస్తుందన్నారు. కానీ, ఒక్క కుటుంబంలో మాత్రమే వెలుగు వచ్చింది, పదువులు వచ్చాయి. వారికి అధికారం ఇచ్చిన ప్రజల బతుకులు ఆగమయ్యాయి. రాజ్యాధికారంలో భాగం ఇస్తామని ఎస్సీలను మోసగించారు. బీసీల పట్ల బీఆర్ఎస్కు చులకనభావం, చిన్నచూపు ఉంది. దేశానికి ఓబీసీ ప్రధానిని అందించిన ఘనత బీజేపీదే. గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే. కేంద్రంలో 70 శాతానికి పైగా అణగారిన వర్గాలకు చోటు దక్కింది అని తెలిపారు.













