బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే.. బీజేపీ గెలిస్తే ప్రజలకు
తనపై విశ్వాసంతో తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన అదిష్ఠానానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంతరంగం, సమస్యలు పూర్తిగా తెలిసిన వాడిని. సీఎం కేసీఆర్ బలం, బలహీనతపై అవగాహన ఉన్నోడిని. పార్టీ అధిష్ఠానం అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనతో కలిసి పని చేస్తా. కేసీఆర్ అహంకారాన్ని ఓడిరచడం బీజేపీతోనే సాధ్యం. బండి సంజయ్ నేతృత్వంలో నాలుగు ఎన్నికలు గెలిచాం. రాష్ట్రంలో గెలిస్తే బీజేపీ, లేదంటే బీఆర్ఎస్ గెలిచాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ఎన్నికనూ గెలవలేదు. బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభం. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం అని అన్నారు.













