పీకే రాకతోనే.. కేసీఆర్ పతనం : ఈటల
దేశంలో ఎక్కడాలేని సమస్య రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నింంచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనకుంటే కేసీఆర్ గద్దె దిగిపోవాలని సవాల్ విసిరారు. పాలన వదిలేసి ఢిల్లీ లో ఎందుకు ధర్నా చేస్తున్నారో కేసీఆర్ చెప్పాలి? అని నిలదీశారు. రైతుల పంటను కొనలేని అసమర్థుడు కేసీఆర్ అని అన్నారు. మహిళ గవర్నర్ తమిళి సై పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ జరిపిన సైకో కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పీకే ప్లాన్లు పనిచేయవని తెలిపారు. తెలంగాణ గడ్డపై సీఎం కేసీఆర్కు ముఖం చెల్లడంలేదన్నారు. పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని అన్నారు.













