సీఎం, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే.. సూపరింటెండెంట్ కు శిక్ష ?
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే, శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడుతూ నిధులు కేటాయించకుండా ఆస్పత్రుల అభివృద్ధి ఎలా సాధ్యమని నిలదీశారు. ధాన్యం కొనకుంటే అధికారం నుంచి కేసీఆర్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నీచ, నికృష్టమైన కేసీఆర్ మతి తప్పిన ఆలోచనలతో రైతులు మునిగిపోయారని విమర్శలు గుప్పించారు. చేతకాక, చేవలేక ముఖ్యమంత్రి చిల్లర పనులు చేస్తున్నారన్నారు. పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నారని అన్నారు. తమపై కోపాన్ని, సీఎం కేసీఆర్ అధికారం ఇచ్చిన రైతులపై చూపుతున్నారని అన్నారు. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నందునే కేసీఆర్ నెపాన్ని కేంద్రంపై వేస్తున్నారని అన్నారు. రైతులు పంటలు వేయకుండా కంటిలో మట్టికొట్టి కేసీఆర్ కనీళ్ళు చూస్తున్నారని ధ్వజమెత్తారు.













