పీకే ఆలోచనలకు తెలంగాణలో ఓట్లు రాలవు
ప్రశాంత్ కిశోర్ (పీకే) ఆలోచనలకు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు రాలవని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపే మోర్చా ఆధ్వర్యంలో బీసీ చైతన్య సదస్సులో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు బడ్జెట్లో రూ.5,500 కోట్లు కేటాయించి, ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. బీసీలకు 33 శాతం రిజ్వరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో రూ.600 కోట్లు ఖర్చు చేసినా టీఆర్ఎస్ గెలవలేదన్నారు. రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలవైన భూములు అమ్మి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులే సీఎం అవుతారని, బీజేపీలో సామాన్యుడు కూడా సీఎం అవుతారని తెలిపారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తుంచే ప్రయత్నం చేశారని, భవిష్యత్‌లో హరీశ్‌రావు వంత కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడే సీఎంకు ప్రజాసమస్యలు గుర్తుకొస్తాయని విమర్శించారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. దళితబంధు ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు.













