ఉప ఎన్నిక వస్తేనే ప్రభుత్వం పనిచేస్తుందా? : ఈటల
ఉప ఎన్నిక వస్తేనే ప్రభుత్వం పనిచేస్తుందా? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్శించారు. మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ మండలం బీజేపీ నేతలు పర్యటించారు. బోగడ భూపతిపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని హుజూరాబాద్ ఈటల రాజేందర్‌తో పాటు పలువురు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ రైతు రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేసినట్టు తెలిపారు. వరి వేయొద్దని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. బియ్యం తీసుకోవడాని కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వానాకాలం ధాన్యం మొత్తం వెంటనే సేకరించాలని డిమాండ్ చేశారు. 2018లో ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.













