రూ.1,74,453 కోట్లతో తెలంగాణ బడ్జెట్
రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19 ని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సభలో మంత్రి ఈటల చదివి వినింపించారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదని ప్రజాకర్షక బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ బడ్జెట్ స్వరూపం
మొత్తం బడ్జెట్ రూ.1,74,453 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,25,454 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.5,520 కోట్లు
ద్రవ్యలోటు అంచనా రూ.29,077 కోట్లు
జీడీపీలో ద్రవ్య లోటు 3.45 శాతం
రాష్ట్ర ఆదాయం రూ.73,751 కోట్లు
కేంద్రం వాటా రూ.29,041 కోట్లు
బడ్జెట్లో కేటాయింపులు ఇలా…
నీటి పారుదల రంగానికి రూ.25వేల కోట్లు
రెండు పడకగదుల ఇళ్లకు రూ.2,643 కోట్లు
పంటల పెట్టుబడి మద్దతుకు రూ.12వేల కోట్లు
రైతు బీమా పథకానికి రూ.500 కోట్లు
వ్యవసాయ యంత్రీకరణకు రూ.522 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.15,563కోట్లు
బిందు తుంపర సేంద్యానికి రూ.127 కోట్లు
గురుకులాలకు రూ.2,283 కోట్లు
ఆర్ అండ్ బీకి రూ.5,575 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.5,650 కోట్లు
చేనేత, జౌళి రంగానికి రూ.1200 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.1,286 కోట్లు
ఐటీ శాఖకు రూ.289 కోట్లు
పురపాలక శాఖకు రూ.7,251 కోట్లు
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1500 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.1000 కోట్లు
ఎస్సీ ప్రగతికి రూ.16,453 కోట్లు
ఎస్టీ ప్రగతి నిధికి రూ.9,693 కోట్లు
సాంస్కృతిక శాఖకు రూ.58 కోట్లు
యాదాద్రి అభివృద్ధికి రూ.250 కోట్లు
వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు
భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు
బాసర, ధర్మపురి ఆలయాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున కేటాయింపు
దళితులకు మూడెకరాలా భూ పంపిణీకి రూ.1,469 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.8,063 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.5,920 కోట్లు
ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.100 కోట్లు
విద్యా శాఖకు రూ.10,830 కోట్లు
గురుకులాలకు రూ.2,823 కోట్లు
వరంగల్ కార్పోరేషన్‌కు రూ.300 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.1,450 కోట్లు
మైనార్టీల సంక్షేమం కోసం రూ.2,500 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.7,375 కోట్లు













