హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఘన విజయం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు. ఈటల తన సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24,068 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తంగా ఈటల రాజేందర్‌కు 1 లక్షా 06 వేల 213 ఓట్లు వచ్చాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,348 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3,012 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2004 నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈటల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.













