పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేంద్రర్
కాంగ్రెస్లో చేరనున్నారన్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదని తెలిపారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ నర్సింహరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమంలో వారిద్దరితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలను కొందరు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. మైనంపల్లి, పట్నంను రాజకీయాల కోసం కలవలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఉన్నానని, పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.













