కేసీఆర్ బెదిరింపులకు, దాడులకు భయపడం : ఈటల
నా కుటుంబం, బీజేపీ శ్రేణులపై ఎన్ని దాడులు చేసినా కేసీఆర్కు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కేసీఆర్ పలుకుబడి కోల్పోయిన తర్వాత అసహనానికి గురై భౌతిక దాడులకు ప్రేరేపిస్తున్నారు. గుండాయిజానికి, కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలు ఒకసారి దెబ్బకొట్టారు. మునుగోడు ప్రజలు కూడా కేసీఆర్ అహంకారానికి బుద్దిచెప్పే విధంగా తీర్పు ఇవ్వాలన్నారు. రూ.వేల కోట్లు అక్రమంగా సంపాదించి, గూండాలను పోగు చేసి మాపై దాడి చేయించారు. టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నాం. రాళ్ల దాడిలో 20కి పైగా కార్లు ధ్వసంమయ్యాయి. పోలీసులు టీఆర్ఎస్ నేతలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.













