సీఎం కేసీఆర్ తల్లకిందులుగా తప్పు చేసినా… మునుగోడులో
ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లకిందులుగా తపస్సు చేసినా మునుగోడు లో టీఆర్ఎస్ గెలవదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైంది. కుత్బుల్లాపూర్ నుంచి అంబర్పేట వరకు పాదయాత్ర సాగనుంది. ముందుగా చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని గెలిపించాలని మునుగోడు ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫ్యూజ్ పీకేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి కేసీఆర్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాని సీఎం కేసీఆర్ ఆ నెపాన్ని కేంద్రంపై రుద్దతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.













