ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
ప్రజాస్వామ్యం ముసుగులో సీఎం కేసీఆర్ రాచరిక పాలన చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నానని, తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. చావుకి అయిన సిద్ధపడతాను కానీ రాజీపడనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నష్టం మీద సందర్శనకు ప్రతిపక్షాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ తనకు తండ్రి లాంటి వారని అన్నారు. ప్రజ సమస్యల మీద స్పీకర్ చర్చ జరపాలని కోరారు. స్పీకర్ సభ అధిపతి అని, అందరి హక్కులు కాపాడాలని సూచించారు. అత్యున్నతమైన పదవిలో ఉండే వ్యక్తి స్పీకర్, పార్టీలకు అతీతంగా సభ్యులకు అవకాశం కల్పించడం శానస సభ స్పీకర్ పని అన్నారు. ఇప్పటి వరకు తనకు నోటీసులు అందలేదని, నోటీసులు వస్తే అప్పుడు సమాధానం చెప్పానన్నారు.
నలుగురు సీఎంల దగ్గర పని చేశా. ఎప్పుడు ఇలా వాళ్లు వ్యహరించలేదు. స్పీకర్ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. హుందాగా బతికిన వ్యక్తి స్పీకర్. అలాంటి వ్యక్తిని అగౌరవపరిచింది మీరు. నేను కాదు. మీరే క్షమాపణలు చెప్పాలన్నారు. మా హక్కులను కాలా రాసే స్పీకర్‌ను నేను మర మనిషి అన్నారు. మేము ఏంటనేది ప్రజలు డిసైడ్ చేస్తారు మీరెవరు. శాసన సభా సమావేశాలు ఉన్నాయని ముందస్తుగా సమాచారం లేదు. మేము స్పీకర్‌కు దీని మీద కాల్ చేసి అడిగాం. అణచివేతకు అన్యాయానికి గురైన వారి పక్షాన బీజేపీ నిలబడతుంది అని అన్నారు.













