బీఆర్ఎస్ కండువా వేసుకోకపోతే.. వారిని తెలంగాణ గడ్డమీద
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ భూమి ఇవ్వకపోగా పేదలకు ఉన్న భూములను లాక్కున్నారని ఆరోపించారు. రూ.10 లక్షల పరిహారం ఇచ్చి రూ.కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు. కొండపాక కలెక్టర్ కార్యాలయం నిమిత్తం 25 ఎకరాల భూమి అవసరమైతే 350 ఎకరాల భూమిని తీసుకొని మిగతా భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించారు. కేసీఆర్ పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నారు. పేదవాళ్లకు కోట్ల విలువ చేసే భూములు ఉండకూడదనే కేసీఆర్ అలా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని కూడా కేసీఆర్ తన ఖాతాలో వేసూకుంటున్నారు. బీఆర్ఎస్ కండువా వేసుకోకపోతే. వారిని తెలంగాణ గడ్డమీద బతకనివ్వం. కేసులు పెడతాం అని బెదిరించే పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.













