ఈటల షాకింగ్ కామెంట్స్… అన్ని పార్టీల్లో కేసీఆర్ కు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈటల మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీలోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో నాతో సహా 20 మందిని ఓడిరచేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఇని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈటల కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రానున్న కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు పొలిటికల్ పార్టీలను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి.













