ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు … తెలంగాణలో
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబు కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2018 లో కాంగ్రెస్‌తో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదని, బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు.













