కేసీఆర్ పై పోటీ చేస్తానన్న… ఛాలెంజ్ కు కట్టుబడి ఉన్నా
సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదని, కచ్చితంగా చేసి తీరుతానని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు. జమ్మికుంటలో జరగనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ చేసిన సవాల్‌పై ఆయన స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసినా, అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా గెలిచానని అన్నారు. ఆ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ను ఓడిరచటమే తన లక్ష్యమని తెలిపారు. ఆ మేరకే గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు.













