మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ ..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‍ను బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు మేరకు ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో స్పష్టం చేశారు. ఈటల మెదక్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ నివేదించారు. దీని ఆధారంగా ఈటల నుంచి వైద్య ఆరోగ్య శాఖ తప్పించాలంటూ ముఖ్యమంత్రి గవర్నర్‍కు సిఫార్సు చేశారు. ఆ శాఖను ముఖ్యమంత్రి వద్దే ఉంచుకున్నారు. తాజాగా పూర్తిస్థాయి నివేదిక రావడంతో ఆయన ఈటల పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.