కరోనా లక్షణాలు పసిగట్టే సెల్ఫ్ చెక్ కియోస్క్
కరోనా లక్షణాలను తెలిపే సెల్ఫ్ చెక్ కియోస్క్ యంత్రాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ కలిసి బీఆర్కే భవన్లో ఆవిష్కరించారు. వర్క్ స్పేస్ మెటల్ సొల్యూషన్ సంస్థ ఈ యంత్రాన్ని ప్రభుత్వానికి బహుకరించింది. ఈ యంత్రం పనితీరును కంపెనీ ప్రతినిధులు వివరించారు. యంత్రం ముందు మనిషి నిలబడగానే శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని వెంటనే లెక్కగట్టి స్క్రీన్‌పై సూచిస్తుంది. మొబైల్ ఫోన్, తాళాలు, ఫైల్స్, ఆఫీస్ బ్యాగ్స్ వంటివి యూవీ బాక్సులో ఉంచితే అన్నింటినీ అది వైరస్ రహితం చేస్తుంది. రాష్ట్రంలో వైరస్ బారిన పడి రీకవరీ అయిన సంఖ్య ఎక్కువగానే ఉందని ఈటల తెలిపారు.













