దేశంలోనే తెలంగాణ అగ్రగామి
దివ్యాంగుల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంద్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమమే ధ్వేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఐదు లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెల 3,016 రూపాయలు పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు అవసరమై వీల్ చైర్లు, చేతి కర్రలు, త్రీ వీలర్ స్కూటర్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందన్నారు.













