మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా.. ఇలాంటి పథకాలు
కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడతూ పల్లె ప్రగతిలో గ్రామాలు బాగుపడ్డాయని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని, దీంతో రోగాలు మాయమైపోయాయని తెలిపారు.ఊర్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడిరచారు. సీఎం కేసీఆర్‌లా దేశంలో ఎవ్వరూ రైతుల అభివృద్ధికి పాటుపడటం లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని, గ్రామాలకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే బండి సంజయ్ భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణపై కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంటే అబద్దాల పార్టీ అని విమర్శించారు.













