వాళ్లను ఉరికించి కొట్టే రోజులు వస్తాయి
బీజేపీ వాళ్లను ఉరికించి కొట్టే రోజులు వస్తాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా సాయం చేయలేదని అన్నారు. కనీసం విభజన చట్ట హామీలను కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలోని రైస్ కొంటారో, కొనరో సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోవాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ రైతు బిల్లులను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడంతోనే తమపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు.













