ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ: మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం దేశంలో అత్యంత ప్రగతి శీల, క్రీయా శీల ప్రభుత్వం’’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సరళీకృత వ్యాపారం (ఈఓడీబీ)పై పారిశ్రామికవేత్త లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసి డర్లని కొనియాడారు. వ్యాపారవేత్తలు తమ అనుభ వాలను ఇతరులకు చెబుతుంటారని, వారి వల్ల రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్న పరిస్థితి గురించి ఇతర పారిశ్రామికవేత్తలకు అవగాహన కలుగుతుం దన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు బాగుందా, అవినీతి ఉందా, వ్యాపారం చేయాలంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా యి, తదితర అంశాలపై ఇక్కడి పారిశ్రామికవేత్తలు చెప్పే సమాధానాలకే విశ్వసనీ యత అధికంగా ఉంటుందన్నారు. సరళీకృత వ్యాపార విధానానికి సంబంధించి 373 సంస్కర ణల్లో ఇప్పటికే 350 సంస్కరణలను అమలు చేశా మని, మిగిలిన సంస్కరణలను అమల్లోకి తెస్తా మన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతోందని ఇటీవల అసోచాం నివేదించిం దని గుర్తు చేశారు.













