ప్రముఖులకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుల ప్రదానం
హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డులను పలువురు ప్రముఖులకు అందజేశారు. ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఐఈ (ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ) సంస్థ వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచి సమాజానికి మార్గదర్శకులుగా నిలిచిన 33 మందికి ఛాంపియన్స్ ఆఫ్ ది ఛేంజ్ అవార్డులను బహుకరించింది. ఎవాక్రురేట్ గ్రూప్ డైరెక్టర్, ప్రముఖ వ్యాపారవేత్త జోషిత రెడ్డి జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ కేజీ బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై ఈ అవార్డులను ప్రధానం చేశారు.
వైద్య విభాగం లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, భరత్ ఠాకూర్, జయరామ్, శ్రీ ధర్, మనీష్ ఒక పాటు మరో ముగ్గురు వైద్యులు ఉండగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్, మై హోమ్ కంపెనీ వ్యవస్థాపకులు జూపల్లి రామేశ్వర్ రావు, మహేష్ బాబు, అల్లు అర్జున్, సమంత ప్రభు, మహమ్మద్ అజరుద్దీన్, సుధారెడ్డి, పి.వి. సింధుతో పాటు 33 మందికి అవార్డులను అంద జేశారు. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డులను అందుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అవార్డు గ్రహీతలు రామేశ్వరరావు నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
పచ్చని ప్రకృతి కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు.













