ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అన్నివిధాలా అనుకూలమైనదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ఫ్రెంచి రాయబారి ఇమ్మాన్యుయెల్ లినయన్, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఫ్రెంచి రాయబారికి మంత్రి కేటీఆర్ వివరించారు. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా నిర్దిష్ట సమయంలో అనుమతులిచ్చే విధానం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. తెలంగాణలోని మానవవనరులు, లభ్యమవుతున్న ముడిసరుకులు, సుస్థిరమైన ప్రభుత్వం, అనువైన వాతావరణం, భౌగోళిక పరిస్థితుల గురించి సవివరంగా తెలియజేశారు. ఈ భేటీలో ఫ్రాన్స్ కాన్సూల్ జనరల్ మార్జోరీ వ్యాన్బేలిగమ్, రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.













