సిసిఎంబి భార్గవ కన్నుమూత
సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పిఎం భార్గవ మంగళవారం సాయంత్రం ఉప్పల్లోని నివాస గృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. భార్గవ మృతిపట్ల ఉప రాష్టప్రతి అభ్యర్ధి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి, రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, తెలంగాణ ఐటి మంత్రి కె తారకరామారావు, వైకాపా నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, వినోద్ రావత్, ప్రదీప్ శ్రీవత్సవ, కొలసాని పుష్ప తదితరులు తీవ్ర సంతాపం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భార్గవ అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్గవకు కుమారుడు మోహిత్, కుమార్తె వినీత ఉన్నారు.













