సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా
సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల నిర్వహణపై సింగరెణి అధికారులు భేటీ అయ్యారు. అక్టోబరు 5న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్యాంసుందర్, సింగరేణి డైరెక్టర్ (పా) పవిత్రన్ కుమార్, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 19వ తేదీని నామినేషన్ల ఉపసంహకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. సెప్టెంబరు 20 నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 5న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ఓట్లను లెక్కిస్తారు.













