తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగరా
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగరా మోగింది. తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రశాశ్ తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 12 కేంద్ర ఎన్నికలం సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 19. మే 30న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్లను లెక్కించనున్నారు.













