కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఈసీ.. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిషేధం

అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహిచిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ఈసీ, బీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది.