voters list : తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల … ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే

తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా (voters list )ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు(Men), 1,68,67,735 మంది మహిళా (Women) ఓటర్లు ఉన్నారు. 2,829 మంది థర్డ్ జెండర్ (Third gender) ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 5,45,026. 85 సంవత్సరాలు దాటిన సీనియర్ ఓటర్లు 2,22,091. ఎన్‌ఆర్‌ఐ(NRI voters) ఓటర్లు 3,591. ప్రత్యేక ప్రతిభావంతులు ఓటర్లు 5,26,993. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 ఓటర్లు ఉన్నారు.