దేశంలోనే మొదటిసారి.. ఎనిమిది సింహాలకు కరోనా

కరోనా సెంకడ్ వేవ్‍తో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఇప్పటివరకు కరోనా లక్షణాలు మనుషుల్లో మాత్రమే కనిపించాయి. జంతువులకు కరోనా వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ కొవిడ్ వైరస్ లక్షణాలు తాజాగా జంతువుల్లో కూడా కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‍లోని నెహ్రూ జూవాలాజిక్ పార్క్ లో 8 సింహాలకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు జూ సిబ్బంది గుర్తించారు. పార్క్ లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా, ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలకు వైరస్ లక్షణాలకు సంబంధించిన శాంపిల్స్ ను కరోనా నిర్ధారణ పరీక్షల కోసం జూ అధికారులు సీసీఎంబీకి పంపించారు. సింహాలకు చెందిన కోవిడ్ నిర్ధారణ పరీక్ష నివేదికలు నేడు రానున్నాయి. మరోవైపు సెకండ్ వేవ్‍లో జంతువులకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది.