వచ్చే జిఎస్టి మీటింగ్ లోనే స్పష్టత
ప్రాజెక్టులపై జిఎస్టి తగ్గింపుపై వచ్చే జిఎస్టి మీటింగ్‌లోనే స్పష్టత వస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వర్క్స్ కాంట్రాక్టుపై జిఎస్టి సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని, ఇప్పటికే 18 శాతం నుంచి 12 శాతం వరకు తగ్గించారన్నారు. దీనికి ఇంకా తగ్గించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారన్నారు. వర్క్స్ కాంట్రాక్ట్స్ను నిర్వచించాలని కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీకే సూచించారన్నారు. ప్రభుత్వం చేపట్టే పనులన్నింటికీ పన్ను తగ్గిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. గ్రానైట్, బీడీల టాక్స్‌పై కూడా జిఎస్టిని తగ్గించాలని కోరామన్నారు. ఈ అంశాన్ని కూడా ఫిట్మెంట్ కమిటీకే కౌన్సిల్ రెఫర్ చేసిందన్నారు.













