కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. ఢిల్లీ కార్యాలయానికి రావాలని లేఖ ద్వారా కోరింది. ఈడీ పిలుపుపై స్పందించిన కవిత ప్రతినిధిగా తన లీగల్ అడ్వైజర్‌ను పంపించారు. కామా మార్చి 11న ఎమ్మెల్సీ కవితకు చెందిన ఫోన్‌ను ఈడీ అధికారులు సీజ్ చేయగా, ఈ నెల 21న ఎమ్మెల్సీ తన 9 ఫోన్లను ఈడీకి అందజేశారు. అయితే సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేసేందుకు సాక్షిగా కవిత గానీ, అమె ప్రతినిధి గానీ రావాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు లీగల్ అడ్వైజర్ సోమా భారత్‌కు అథరైజేషన్ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి విచారణకు పంపినట్లు సమాచారం.













