కవిత భర్తకు ఈడి నోటీసులు.. రంగంలోకి దిగిన కేసీఆర్..

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కెసిఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఆమె భర్తతో పాటు మరో ముగ్గురికి కూడా ఈడి అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికే ఈ నలుగురికి సంబంధించిన ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. శుక్రవారం నాడు కవిత ఇంట్లో ఇడి డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించారు. కవిత భర్త అనిల్ జరుపుతున్న వ్యాపార లావాదేవీల పై కూడా ఆరాలు తీసినట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక కవితకు కోర్టు ఏడు రోజులపాటు కస్టడీ ఇచ్చింది. దీంతో స్వయంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలో కవిత కేసు విషయంలో ఢిల్లీలో ప్రత్యేకమైన అడ్వాకేట్స్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సోమ భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ టీం కవిత కేసు విషయంలో పనిచేయబోతున్నారు. ఈ కేస్ మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.