మొన్న సోదాలు.. నేడు నోటీసులు… ఎంపీ నామాకు ఝలక్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వర రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 25 న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈయనతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికీ కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. మూడు రోజుల కిందటే ఎంపీ నామా ఇంట్లో, కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లను, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈయనతో పాటు మధుకాన్ డైరెక్టర్ ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేసింది. వెయ్యి 64 కోట్లకు బ్యాంకులను మోసం చేశారన్నది ఆయనపై అభియోగం. ఓ ప్రాజెక్ట్ కోసం లోన్ తీసుకొని, కోట్లాది రూపాయలను పక్కదారి పట్టించారన్నది.నామాపై ఉన్న అభియోగం.













