టీఆరెస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

టీఆరెస్ ఎంపీ నామా నాగేశ్వర రావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటు మరో 5 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లోన్ రూపంలో డబ్బులు తీసుకొని, వాటిని విదేశీ కంపెనీలకు ఆ డబ్బు మళ్లించారన్నది ఎంపీ నామాపై ప్రధాన అభియోగం. 1064 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నామా నివాసాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. నామా ఇళ్లు, ఆఫీసులతో పాటు “రాంచీ ఎక్స్ ప్రెస్ వే” సీఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీతేజ నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది. కంపెనీలకు సంబంధించిన కీలక ఫైళ్లను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు 2019లోనే నామాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మధుకాన్ ఇండస్ట్రీ ఆడిటర్లతో పాటు మరికొన్ని ఇండస్ట్రీ ఆడిటర్లను కూడా సీబీఐ తన ఛార్జిషీట్ లో నమోదు చేసింది.