ఉప ఎన్నికలో ఆ పార్టీని.. బొంద పెట్టడం ఖాయం
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఖాతా నుంచి రూ.5 కోట్ల 24 లక్షలు వెళ్లిన నగదు లావాదేవీలపై వివరణ కోరుతూ రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సుశీ ఇన్ఫ్రా అకౌంట్ నుంచి బదిలీ అయిన ఐదు కోట్లకు పైగా నగదు అంశానికి తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్కు వివరణ కూడా ఇచ్చామన్నాని తెలిపారు. టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఆ పార్టీ నేతలు పిచ్చి చేష్టలు చేస్తున్నారని ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటర్లు బొంద పెట్టడం ఖాయమన్నారు.













