ఎన్నికల వేళ తెలంగాణ రైతులకు… శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం రైతు బంధు అమలుకు అడ్డంకులు తొలిగాయి. ఎన్నికల వేళ ఈసీ రైతు బంధు పథకం అమలుపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ రైతు ఖాతాల్లో నగదు జమకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్గకుండా ఈ పథకాన్ని అమలు చేసుకోవాలని సూచించింది. ఈనెల 18న ఈసీకి అందిన లేఖ మేర రబీ సీజన్లో రైతు ఖాతాల్లోకి జమ చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే సైలెన్స్ పీరియడ్‌కు, ఎన్నికల ప్రక్రియకు ఇది ఎటువంటి విఘాతం కల్గించొద్దని సూచించింది. ఇది ఆన్‌గోయింగ్ స్కీం కావడంతో ఆపద్ధర్మ ప్రభుత్వానికి అడ్డంకులు లేకుండా ఈసీ నిర్ణయం తీసుకున్నది. రైతుల పెట్టుబడి సాయానికి మార్గం సుగమమం కావడంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.













