అయోధ్య బాలరాముడికి దుబ్బాక చేనేత వస్త్రం

అయోధ్య బాలరాముడికి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత లివిన్ వస్త్రాలంకరణలో దర్శమిచ్చాడు. దుబ్బాక హాండ్ల్యూమ్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ ప్రొప్రయిటర్ బోడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ రంగు లినిన్ వస్త్రం తయారు చేసి అయోధ్య స్వామివారికి సమర్పించారు. అయోధ్య రామాలయంలో దేశంలోని ప్రధాన చేతి వృత్తుల వారి వస్త్రాలను బాలరాముడికి అలకరిస్తున్న క్రమంలో దుబ్బాక చేనేత వస్త్రాన్ని అలంకరించారు.