దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సుజాత?
దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నికల చర్చ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించి ఆకస్మికంగా సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను పోటీలో నిలపాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నప్పటికీ రామలింగారెడ్డి కొడుకు సతీష్‌రెడ్డిని ఆయన కటుంబ సభ్యులు బలపరుస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచి ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న రామలింగారెడ్డి మృతితో తిరిగి ఆయన కుటుంసభ్యులనే పోటీలో నిలపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే రామలింగారెడ్డి భార్య సూజాతను పోటీలో నిలపాలనే ఆలోచనల్లో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఇదే నియోజకవర్గం నుంచి అవకాశం లభిస్తే పోటీ చేసేందుకు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ముత్యం రెడ్డిలు కూడా తమ అభిప్రాయాలు టీఆర్ఎస్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.













