హైదరాబాదులో మరొకసారి డ్రగ్స్ కలకలం..

తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది కాలంగా డ్రగ్స్ తీవ్రమైన కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్ నగరంలో పట్టుబడిన డ్రగ్స్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎస్‌వోటీ అధికారులు పోలీసు శాఖ తో కలిసి నగరంలోని కూకట్‌పల్లి పరిధిలో ఉన్న శేషాద్రి నగర్ లో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు అధికారులకు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం లభ్యమయ్యింది. ఆ తర్వాత డ్రగ్స్ ను స్వయంగా విక్రయిస్తున్న రాజశేఖర్, శైలేష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తులసీ నగర్లోని జగద్గిరిగుట్టలో నిర్వహించిన సోదాలలో రోహిత్, తిలక్ సింగ్ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ దొరికింది. దీంతో ఆ ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.