ప్రపంచంలోనే తొలిసారిగా.. పాలమూరులో
ప్రపంచంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 450 డ్రోన్ కెమెరాలతో విన్యాసాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి డ్రోన్ షోను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ డౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 450 డ్రోన్లతో అతి పెద్ద ప్రదర్శన అద్బుతంగా కొనసాగింది. ఒక్కసారిగా అన్ని డ్రోన్లు రంగురంగుల లైట్లతో మిరుమిట్లు గొలుపుతూ ఐలాండ్ మీది నుంచి గాలిలోకి లేచాయి. పిల్లాపాప తేడా లేకుండా వేలాది మంది ప్రజలు ట్యాంక్ బండ్ మీదకు తరలివచ్చారు. డ్రోన్ ప్రదర్శనను తిలకించేందుకు వచ్చినవారితో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది.













