ఆగస్టు తర్వాత కరోనా తగ్గుముఖం
దేశంలో ఆగస్టు తర్వాత కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని అమెరికా చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సభ్యుడు, చికాగో వర్సిటీ క్లినికల్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ఎల్డండి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీ హెచ్చార్డీలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌తో ఆయన భేటీ అయ్యారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి ఈటల వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే కేసులు గుర్తించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. కరోనా కేసుల సంఖ్య ఆగస్టు వరకు పతాకస్థాయికి చేరుకొని.. తర్వాత తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.













