వచ్చే నెలలో కరోనా మందు : డాక్టర్ రెడ్డీస్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ కూడా కరోనా వైరస్ ప్రాథమిక దశలో నియంత్రించే ఔషధాలను విడుదల చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే ఆర్ అండ్ డీలో పరిశోధనలు జరుగుతున్నాయని, వచ్చే నెలలో రెండు యాంటీ వైరల్ ఔషధాలనైనా రెమిడెవిసిర్, ఫావిపిరావిర్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పాటు 127 దేశాల్లో ఈ ఔషధాలను తయారు చేయడం, అక్కడి మార్కెట్లో విక్రయించడానికి గత నెలలో గిలీడ్ సైన్స్ ఇండస్ట్రీతో నాన్- ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. వీటితోపాటు టోక్కోకు చెందిన ప్యూజిఫిల్మ్ కార్పొరేషన్ అండ్ గ్లోబల్ రెస్పాన్స్‌తో కలిసి అవిగన్ ట్యాబ్లెట్ల (ఫావిపిరావిర్)ను తయారు చేస్తున్నది. ఈ ఔషధాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఏషియన్ మార్కెట్లకు ఎగుమతి చేసే ఆలోచనలో సంస్థ ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.













