తెలంగాణలో మరో కొత్త పార్టీ
కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ తనయుడు, డాక్టర్ పుంజాల వినయ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతోంది. వినయ్ తన మద్దతుదారులతో భేటీ అయ్యారు. తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్‌తో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వినయ్ ప్రకటించారు. తన స్నేహితుడు డాక్టర్ మిత్ర ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రాజకీయవేత్తలకు గుర్తు చూసి ఓటేసే వాళ్లు కావాలన్నారు. ఓటింగ్‌లో గుర్తులను కూడా ఓటర్లు గుర్తు పట్టలేని స్థితికి ప్రజలను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. చదువుకున్నప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థిని చూసి ప్రజలు ఓటేస్తారని, అందుకే ప్రభుత్వాలు విద్యకు ఖర్చు పెట్టడం లేదని, విద్యా వ్యవస్థను నీరు గారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్లో కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు.













