తెలంగాణకు దక్కిన అరుదైన అవకాశం..
అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం (ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డా.కేశవులు ఎంపికయ్యారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో భాగంగా ఇస్టా 2022`25 కాలానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి అరుదైన అవకాశం లభించింది. ఇస్టా అధ్యక్షుడిగా కేశవులును ఎన్నుకున్నారు.2019లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఇస్టా సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సు నిర్వహణ తీరుపట్ల ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా అనాటి సదస్సు లో ఇస్టా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కేశవులు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘానికి అందజేస్తున్న సేవలను గుర్తించి ఆయన సేవలను మరింత ఉపయోగించుకునేందుకు ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. ఇస్టా ఉపాధ్యక్షుడిగా యు.ఎస్‌కు చెందిన ఎర్నైస్ట్ అలెన్ ఎన్నికయ్యారు.













