డా|| కె.ఎ.పాల్ ఇంటర్నేషనల్ ప్రేయర్ టవర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిష్టర్ నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్లో డా|| కె.ఎ.పాల్ ఇంటర్నేషనల్ ప్రేయర్ టవర్ (ఐపిటి) ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రేయర్ టవర్ నేషనల్ కో-ఆర్డినేటర్ జ్యోతి బేగల్, యు.ఎస్ ఇంటర్నేషనల్ కో-ఆర్డినేటర్ బిషప్ జి.ఎస్ శీలన్, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆన్లైన్లో కె.ఎ.పాల్ మాట్లాడుతూ..ప్రపంచంలో ఉన్న 200 వందల దేశాల్లోని 200 కోట్ల క్రైస్తవులు, ఇతర మతాల, ప్రాంతాల వారిని శాంతితో ప్రేమించండి. ప్రభువు అడుగుతున్నాడు.. నీవు నీలాగే ఇతరులను కూడా ప్రేమించమని. బైబిల్ కూడా ఇదే చెబుతుంది. నేడు ప్రపంచానికి కూడా ఇదే కావాలి. ఇదే ఉద్ధేశ్యంతో నేను హైద్రాబాద్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేయబోయే ఈ ఇంటర్నేషనల్ ప్రేయర్ టవర్ ద్వారా ప్రపంచంలోని శాంతి ప్రేమికులందరూ తమ సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయవచ్చు…అని అన్నారు.













