Dk Aruna : సంథ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలి : డీకే ఆరుణ

సంథ్య థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో సినీ పరిశ్రమపై ప్రభుత్వ వేధింపులుగా భావించాల్సి వస్తుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ (Dk Aruna) అన్నారు. కిమ్స్ ఆస్పత్రి (KIMS Hospital) లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sreetej)ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అభిమానులుగా వెళ్లిన కుటుంబంలో తల్లి రేవతి (Revathi ) చనిపోవడం, కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండడం బాధాకరమన్నారు. సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉండాలన్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా ముగింపు పలకాలని కోరారు.