ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మించబోయే మసీదుకు ఎవరు చందాలు ఇవ్వకూడదని పిలుపునిచ్చారు. అక్కడ నమాజు చేయడమే ఇస్లాంకు వ్యతిరేకమని (హరామ్) ఆయన అనడం గమనార్హం. బీదర్లో జరిగిన ఓ కార్యక్రమంలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మత పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చెప్పారు. దానిని మసీదు అని అనరని, అక్కడ ప్రార్థనలు చేయకూడదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన ఉలేమాలే చెబుతున్నారని అసద్ అన్నారు. రిపబ్లిక్ డేనాడే అయోధ్యలో మసీదు నిర్మాణం ప్రారంభమైన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు కంటే పెద్దగా దీనిని నిర్మించనున్నారు. అయితే అసద్ వ్యాఖ్యలను ఖండించారు అయోద్య మసీదు ట్రస్ట్ కార్యదర్శి అథర్ హుస్సేన్. ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ ఎజెండాలో భాగమని అన్నారు.













