ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం
దివంగత డాక్టర్ ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూర్తిగా అండగా ఉన్నారు. ఇటు ప్రభుత్వం, అటు ఆమె కుటుంబానికి మధ్య వారధిగా నిలిచారు. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్తిస్తామని చెప్పిన విధంగా ఆమె చెల్లి పూజకు హెచ్ఎండీఏ ఐటీ సెల్లో కాంట్రాక్ట్ బేసిస్‌లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించారు. ఈ మేరకు హెచ్ఎండీఏ సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. డాక్టర్ ప్రీతీ మరణంతో తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని ప్రీతి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ తాను నిర్వహిస్తున్న పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే హెచ్ఎండీఏ ఐటీ సెల్లో కాంట్రాక్ట్ బేసిస్‌లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.













