తెలంగాణలో 107 మందిపై అనర్హత వేటు : ఈసీ

ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చులు సమర్పించని వారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులైన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 107 మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఈసీ వెల్లడించింది. అనర్హుల్లో అత్యధికంగా నిజాబాబాద్ లోక్‌సభ పరిధి వారు ఉండటం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి గతంలో పసుపు బోర్డు కోసం 72 మంది పార్లమెంట్, 35 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం వీరంతా అనర్హులని ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే మెదక్ లోక్‌సభ పరిధిలో హన్మంత రెడ్డి, మహబూబాబాద్ నుంచి కొల్లూరి వెంకటేశ్వర్రావు, నల్లగొండ నుంచి పోలీ చేసిన కే వెంకటేశ్ లు అనర్హుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీలో పోటీ చేసిన వారు వచ్చే ఆగస్టు వరకు, లోక్‌సభకు పోటీ చేసినవారు వచ్చే జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులుగా ఈసీ ప్రకటించింది.